![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' గుప్పెడంత మనసు '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-1007 లో.. వసుధారని తీసుకెళ్ళడానికి వచ్చిన రాజీవ్ ని చూసి మహేంద్ర, మను ఇద్దరు భయపెడతారు. నువ్వు ఇక్కడికి నుండి వెళ్ళకపోతే బుల్లెట్లు చూస్తావని మను అంటాడు. ఏంటి భయ్యా మమ్మల్ని పని చేసుకోనివ్వరా, మేమ్ ఎంత బిజీ ఉంటామో తెలుసా.. ప్రతీ గంటకి ప్లాన్ చేసుకోవాలి. డీబీఎస్టీ కాలేజీలో డైరెక్టర్ గా జాయిన్ అయ్యారంట కదా భయ్యా అందుకే మీకు థాంక్స్ చెప్పడానికి వచ్చానని రాజీవ్ అంటాడు.
రాజీవ్ జేబులో నుండి తాళిని తీసి ఇది ఎప్పటికైనా నీ మెడలో కట్టాల్సింది నేనే అని రాజీవ్ అనగానే.. పెళ్ళి అయిన అమ్మాయితో ఏం మాట్లాడుతున్నావ్ రా పోరంబోకులా అని మహేంద్ర అంటాడు. ఒక్కసారి గన్ చూసి భయపడితే ప్రతీసారీ భయపడతానని అనుకోకు నా టైమ్ వస్తుంది అప్పడు నేనేంటో చూపిస్తానని రాజీవ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఈ రాజీవ్ గాడు వెళ్ళి చాలా సేపు అయింది. కానీ ఫోన్ ఏం చేయలేదు. అసలు వెళ్ళాడా లేదా వసుధారని తీసుకొచ్చాడా లేదా ఏం జరిగిందో ఫోన్ చేయలేదు మనమే ఫోన్ చేద్దామని రాజీవ్ కి శైలేంద్ర ఫోన్ చేస్తాడు. ఎన్ని సార్లు చేసిన రాజీవ్ లిఫ్ట్ చేయడు. తర్వాత లిఫ్ట్ చేస్తాడు రాజీవ్. అరేయ్ ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయవని శైలేంద్ర అనగానే.. నా ఫోన్ నా ఇష్టంరా, లిఫ్ట్ చేస్తా చేయనురా అని రాజీవ్ అంటాడు. రా అంటే ఫీల్ అయినట్టున్నాడు.. అవసరం మనది. మనమే కాస్త తగ్గి మాట్లాడాలని శైలేంద్ర అనుకొని.. బ్రదర్ కాస్త కూల్ గా మాట్లాడండని శైలేంద్ర అంటాడు. నీకు నాకు ఉన్న కామన్ శత్రువు ఆ మను గాడు అక్కడికి వచ్చాడు. నేనెళ్ళేసరికి అక్కడ ఉన్నాడు. ఆ రిషే గాడే నయం వాడిని నా మాటలతో నమ్మించేవాడిని, భయపెట్టేవాడిని కానీ వీడు అలా లేడని అందుకే వెనుకడు వేశానని రాజీవ్ అంటాడు. అలా ఎలా వదిలేస్తావ్ .. వాడిని ఏదో ఒకటి చేసి వసుధారని ఇక్కడికి తీసుకురావాలి కదా నీకు అసలు బుద్ధి ఉందా అని శైలేంద్ర తిడతాడు. వాడిని తప్పిస్తే నీకు నాకు ఈ టెన్షన్ ఉండేది కాదు కదా అని రాజీవ్ అనగానే శైలేంద్ర తడబడతాడు. నువ్వు ఎందుకు అలా చేయకుండా ఆగిపోయావో నేను కూడా ఇప్పుడు ఇలా చేయకుండా ఆగిపోయానని రాజీవ్ అంటాడు. కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నాక రాజీవ్ త్వరలో తీపి వార్త చెప్తానని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక మనుకి ఆ ఫ్యామిలీకి ఏ సంబంధం ఉందో నాకనవసరం ప్రతీసారీ అడ్డు వస్తున్నాడు ఏదో ఒకటి చెయ్యాలని శైలేంద్ర అనుకుంటాడు.
డైనింగ్ టేబుల్ దగ్గర మను, అనుపమ, మహేంద్ర, వసుధార కలిసి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటారు. ఆ రాజీవ్ ని తిడుతూ కాసేపు మాట్లాడుకుంటారు. అలా సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు మనుకి పొలమారుతుంది. అది చూసి అనుపమ వెంటనే లేచి తలపై చేయితో తడుతూ వాటర్ తాగిస్తూ .. ఎమోషనల్ అవుతుంది. తినేటప్పుడు మాట్లాడొద్దని చెప్పాను కదా ఎందుకు మహేంద్ర మాట్లాడిస్తున్నావని అతనిపై సీరియస్ అవుతుంది అనుపమ. ఇదీ మరీ బాగుంది మనుకి పొలమారితే నన్ను అంటావా? అని మహేంద్ర అంటాడు. ఎవరో గుర్తుకుతెచ్చుకున్నారని మహేంద్ర అనగానే.. నాకెవరు లేరని మను అంటాడు. దాంతో అనుపమ తినే అన్నం ముద్ద తినకుండా ప్లేట్ లోనే వదిలేస్తుంది. అందరితో ఇలా తింటే బాగుందని మను అనగానే.. ఎప్పుడు నువ్వు ఇలా తినవా అని మహేంద్ర అడుగుతాడు. నాకు ఆ అదృష్ణం లేదు సర్.. ఎప్పుడు ఒక్కడినే తింటా అని మను ఎమోషనల్ అవుతాడు. పక్కనే ఉన్న అనుపమ ఎమోషనల్ అవుతుంది. ఇక మహేంద్ర సర్దిచెప్తాడు. కాసేపటికి అనుపమకి వాళ్ళ పెద్దమ్మ కాల్ చేస్తుంది. నాకు ఆ విషయం ఎందుకు చెప్పలేదని వాళ్ళ పెద్దమ్మపై అనుపమ సీరియస్ అవుతుంది. అది సరే గానీ వాడు ఒకరి ఇంటికి భోజనానికి వెళ్ళాడని నేను చెప్పగానే నువ్వు ఏం అన్నావో గుర్తు ఉందా అని అనుపమతో వాళ్ళ పెద్దమ్మ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |